Home  »  TV News  »  ఇంట్లో నుండి వెళ్లిపోయిన కావ్య.. షాక్ లో దుగ్గిరాల కుటుంబం!

Updated : Oct 10, 2023


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -222 లో.. ఇంట్లో కావ్య ఎక్కడ కన్పించడం లేదని రాజ్ సీతారామయ్య గదిలోకి వెళ్లి చూస్తాడు... అక్కడ కూడా లేకపోయేసరికి కావ్యకీ ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో రాజ్ కి టెన్షన్ మొదలవుతుంది. ఇంట్లో అందరు వచ్చి మా దగ్గర లేదంటే, మా దగ్గర లేదని చెప్తారు. ఎక్కడికి వెళ్లి ఉంటుంది. పైగా ఇంత రాత్రి అని అందరు కంగారుపడుతుంటారు.

ఆ తర్వాత ఈ అక్క చెల్లెళ్ళకి అలవాటేగా ఇలా అవకాశం దొరికినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్లడమని రుద్రాణి అనగానే.. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. కావ్య లాగా తిన్నది అరగకుండ ఏం వెళ్ళలేదని స్వప్న అనగానే..  రాజ్ స్వప్న పై కోప్పడతాడు. మీ చెల్లి నువ్వు కన్పించకపోతే ఎంత కంగారు పడిందో నాకు తెలుసు. అలాంటిది మీ చెల్లె గురించి ఇలా మాట్లాడతావా స్వప్నని అని రాజ్ అంటాడు. మరొకవైపు అపర్ణ కూడా కావ్య కీ సపోర్ట్ గా మాట్లాడుతుంది.

ఎప్పుడు తను అంటే నాకు పడదు కానీ ఎప్పుడు బాధ్యత లేకుండా ప్రవర్తించలేదని అపర్ణ అనగానే.. నువ్వేనే మీ కోడలు గురించి మాట్లాడేది. ఎక్కడ నీ వలనే వెళ్ళిందని అంటారేమోని ముందే ఇలా మాట్లాడుతున్నావా వదిన అని రుద్రాణి అనగానే.. అపర్ణ తనపై కోప్పడుతుంది. అందరు ఈ సిచువేషన్ లో కూడా గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న రుద్రాణిని తిడతారు. ఆ తర్వాత అందరు బయటకు వెళ్ళి కావ్య కోసం వెతుకుతారు.

మరొకవైపు కావ్య రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంటి పత్రాలని కనకం తీసుకోని వచ్చి.. మీ దగ్గరే ఉంచండంటూ కృష్ణమూర్తికి ఇస్తుంది. లేదు బీరువాలో పెట్టు అని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత రాజ్ కనకంకి ఫోన్ చేసి.. కావ్య వచ్చిoదా అని అడుగుతాడు. రాలేదు ఎక్కడడికి వెళ్ళిందని కనకం అనగానే.. పని ఉంది వెళ్ళొస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదని రాజ్ చెప్తాడు.. కనకం కు డౌట్ వచ్చి కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. మీ అన్నయ్య అంత చెప్పాడు అసలేం జరిగిందని కనకం అడుగుతుంది. వదిన చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయిందని కళ్యాణ్ చెప్పగానే.. కనకం షాక్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.